IND vs SL: రెండు గంటలపాటు ఇండియాకు బౌలింగ్.. మ్యాచ్‌లోనే స్లో ఓవరేట్‌తో మూల్యం చెల్లించుకున్న శ్రీలంక

IND vs SL: రెండు గంటలపాటు ఇండియాకు బౌలింగ్.. మ్యాచ్‌లోనే స్లో ఓవరేట్‌తో మూల్యం చెల్లించుకున్న శ్రీలంక

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక స్లో ఓవర్ రేట్ కారణంగా మూల్యం చెల్లించించుకుంది. శుక్రవారం (సెప్టెంబర్ 26) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో లంక బౌలర్లు నిర్ణీత సమయం లోపు ఇన్నింగ్స్ ను పూర్తి చేయలేకపోయారు. మొదట ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ దాదాపు రెండు గంటల పాటు సాగింది. 8 గంటలకు ఇండియా బ్యాటింగ్ కు దిగితే 10 గంటలకు తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇండియా బ్యాటర్లు చెలరేగడంతో శ్రీలంక బౌలింగ్ ప్రణాళికలు, ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంది.

లంక బౌలర్లు ఎక్స్ ట్రాలు ఎక్కువగా ఇచ్చారు. స్లో ఓవరేట్ కారణంగా మ్యాచ్ లోనే శ్రీలంకకు అంపైర్ పనిష్ మెంట్ ఇచ్చారు. ఇన్నింగ్స్ 20 ఓవర్ ముందు సర్కిల్ బయట ఉన్న ఎక్స్ ట్రా ఫీల్డర్ ను ఒకరిని లోపల ఫీల్డింగ్ చేయమని అంపైర్లు సూచించారు. దీంతో చివరి ఓవర్ లో సర్కిల్ బయట ఐదు ఫీల్డర్లు బదులు నలుగురే బయట ఉన్నారు. చివరి ఓవర్ లో మొత్తం 13 పరుగులు వచ్చాయి. మ్యాచ్ తర్వాత లంక జట్టుకు స్లో ఓవరేట్ కారణంగా జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లంక బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61: 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎప్పటిలాగే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా.. మిడిల్ ఆర్డర్ లో సంజు శాంసన్ (39), తిలక్ వర్మ (49) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దసున్ షనక, వనిందు హసరంగా, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, అసలంక తలో వికెట్ తీసుకున్నారు. భారీ ఛేజింగ్ లో శ్రీలంక ఏమయినా మిరాకిల్ చేస్తుందేమో చూడాలి.