
ఆసియా కప్ లో సోమవారం (సెప్టెంబర్ 15) శ్రీలంక, హాంకాంగ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు శ్రీలంక ఒక మ్యాచ్ లో ఆడితే విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో లంక జట్టు అలవోక విజయాన్ని అందుకుంది. మరోవైపు హాంకాంగ్ డేంజర్ జోన్ లో ఉంది. ఇప్పటివరకు టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం ఘోరంగా ఓడింది.
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ పై పరాజయం పాలైన హాంకాంగ్.. నేడు శ్రీలంకతో ఓడిపోతే టోర్నీ అధికారికంగా నుంచి నిష్క్రమిస్తోంది. మరోవైపు శ్రీలంక ఈ మ్యాచ్ లో గెలిస్తే సూపర్- 4 కు చేరువవుతుంది.
హాంకాంగ్ (ప్లేయింగ్ XI):
జీషన్ అలీ (వికెట్ కీపర్), అన్షుమన్ రాత్, బాబర్ హయత్, నిజాకత్ ఖాన్, షాహిద్ వాసిఫ్, కించిత్ షా, యాసిమ్ ముర్తాజా (కెప్టెన్), ఐజాజ్ ఖాన్, ఆయుష్ శుక్లా, ఎహ్సాన్ ఖాన్, అతీక్ ఇక్బాల్
శ్రీలంక (ప్లేయింగ్ XI):
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషార
►ALSO READ | T20 World Cup 2026: కాంట్రాక్ట్ లిస్ట్‌లో లేకపోయినా దేశం కోసం: 2026 టీ20 వరల్డ్ కప్ ఆడతానని కన్ఫర్మ్ చేసిన విలియంసన్