కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ

న్యూఢిల్లీ: కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆద్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీని పాకిస్తాన్ ఆహ్వానించింది. మతపరమైన పర్యటనలను ప్రోత్సహించడంతో పాటూ.. హింస లేని ప్రపంచం కోసం మాట్లాడవలసిందిగా కోరుతూ రవిశంకర్‌ను పాకిస్తాన్ ఆహ్వానించింది. ఇండియా, పాకిస్తాన్‌లను కలిపే కర్తార్ పూర్ కారిడార్ రెండు దేశాలలోనూ నవంబర్ 9, శనివారం రోజున ప్రారంభం కానుంది. దీనికోసం రెండు దేశాలు పెద్ద ఎత్తున వేడుకలు చేయాలని నిర్ణయించాయి. మూడు కిలోమీటర్ల పొడవు గల ఈ కర్తార్ పూర్ కారిడార్ మన దేశం నుంచి వెళ్లే సిక్కుయాత్రికులను నేరుగా కర్తార్ పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌కు తీసుకెళ్తుంది. ఇక్కడే గురునానక్ దేవ్ 1539లో చనిపోయాడు. ఈ కారిడార్‌ను భారత యాత్రికులు ఎటువంటి వీసా అవసరం లేకుండానే సందర్శించవచ్చు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి సంబంధించి భారత్ శనివారం రోజున ప్రారంభ వేడుకలు నిర్వహించనుంది. మూతపడ్డ కర్తార్ పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభించడానికి భారతదేశం నవంబర్ 26, 2018న పునాది వేయగా, పాకిస్తాన్ రెండు రోజుల తర్వాత అంటే నవంబర్ 28, 2018న పునాది వేసింది.