‘మిలీ’ ఇదొక సర్వైవల్ థ్రిల్లర్

‘మిలీ’  ఇదొక సర్వైవల్ థ్రిల్లర్

ఐదేళ్ల క్రితం ‘ధడక్‌‌‌‌‌‌‌‌’తో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయమైన శ్రీదేవి కూతురు జాన్వీకపూర్.. సక్సెస్‌‌‌‌‌‌‌‌, ఫెయిల్యూర్స్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకునే ఆమె, సినిమాల విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్స్‌‌‌‌‌‌‌‌ని ఎంచుకుంటోంది. గుంజన్ సక్సేనా, రూహీ చిత్రాలతో పాటు ఇటీవల వచ్చిన ‘గుడ్‌‌‌‌‌‌‌‌ లక్ జెర్రీ’లోనూ ఈ తరహా పాత్రల్లోనే నటించింది.

త్వరలో తన నుండి రాబోతున్న ‘మిలీ’  సినిమా కూడా ఇలాంటిదే. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. మలయాళంలో హిట్ అయిన ‘హెలెన్‌‌‌‌‌‌‌‌’కి రీమేక్. నిన్న ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఓ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌లో పార్ట్‌‌‌‌‌‌‌‌ టైమ్ జాబ్ చేస్తోన్న మిలీ, ఒకరోజు రాత్రి అనుకోకుండా కోల్డ్ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌లో ఇరుక్కుపోతుంది. అక్కడి నుండి ఎలా బయటపడింది, తనను తాను కాపాడుకోడానికి ఎలా పోరాడింది అనేదే మెయిన్ కాన్సెప్ట్. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాన్వీ నటన ఇంప్రెస్ చేసింది. ఒరిజినల్ వెర్షన్ తీసిన ముత్తుకుట్టి జేవియర్ హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాన్వీ తండ్రి బోనీకపూరే నిర్మిస్తున్నారు. నవంబర్ 4న సినిమా విడుదల కానుంది. మలయాళంలో మెప్పించిన ఈ మూవీ హిందీలో జాన్వీకి హిట్‌‌‌‌‌‌‌‌ ఇస్తుందేమో చూడాలి!