శ్రీశైలం డ్యాంలో 67 టీఎంసీలు

శ్రీశైలం డ్యాంలో  67 టీఎంసీలు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. కర్నాటకలోని ఆల్మట్టికి 51వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 46వేల క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. నారాయణపూర్ కు 45,550 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా,డ45,785 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

మరోవైపు తుంగభద్ర జలాశయానికి వరద పెరిగింది. 32,579 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, నీటి నిల్వ 40.94 టీఎంసీలకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టుకు 68వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 79వేల క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 46,614  క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నీటి నిల్వ 67.28 టీఎంసీలకు చేరింది. నాగార్జునసాగర్ కు 27,389 క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి నిల్వ 170.70 టీఎంసీలకు చేరింది.

గోదావరి బేసిన్ లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. 16,395 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా,5,502 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. ఎస్సారెస్పీలో నిల్వ 36.32 టీఎంసీలు ఉంది. మిడ్ మానేరు నుంచి ఎల్ఎండీకి 7,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 5,242 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. కడెం ప్రాజెక్టుకు సీజన్ లోనే అత్యధికంగా 4,053 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 7.60 టీఎంసీలకు 4.90 టీఎంసీలుగా ఉంది.