డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన ఫారెస్ట్ సిబ్బంది.. శ్రీశైలం అడవి దాడి కేసులో ట్విస్ట్..

డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన ఫారెస్ట్ సిబ్బంది.. శ్రీశైలం అడవి దాడి కేసులో ట్విస్ట్..

ఏపీలోని శ్రీశైలంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి... ఫారెస్ట్ సిబ్బందిని అర్థరాత్రి కార్లలో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేయటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. శుక్రవారం ( ఆగస్టు 22 ) అటవీశాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది.

ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఏ2 గా చేర్చి.. జనసేన నేత అశోక్ రౌత్ ను ఏ1 గా చేర్చడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరిపైనా బెయిలబుల్ కేసులు పెట్టడం గమనార్హం. అయితే.. టీడీపీ ఎమ్మెల్యేను తప్పించేందుకే ఈ కేసులో ఏ2 గా చేర్చారని, తమ పార్టీ నేతను ఏ1 గా చేర్చారని ఆరోపిస్తున్నారు జనసేన శ్రేణులు.

►ALSO READ | AP లిక్కర్ స్కాం : సిట్ అదుపులో మాజీ డిప్యూటీ సీఎం.. 3 రోజుల తనిఖీల తర్వాత..

ఈ అంశంపై ఫారెస్ట్ సిబ్బంది పవన్ కళ్యాణ్ ను కలిసి ఫిర్యాదు చేయడం కీలకంగా మారింది. ఈ ఘటనకు బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. గురువారం ( ఆగస్టు 21 ) జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బుడ్డాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు జనసేన నేత అశోక్ రౌత్ ను ప్రధాన నిందితుడిగా చేర్చడంతో పోలీసులపై విమర్శలు వస్తున్నాయి.