
ఏపీ లిక్కర్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలపై ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ విచారణ వేసింది. కొన్నాళ్లుగా సాగుతున్న విచారణలో ఇప్పటికే కొంత మంది అరెస్ట్ కాగా.. ఫస్ట్ టైం రాజకీయ నేతల విచారణ చేపట్టింది సిట్. జగన్ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా.. డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణమూర్తిని విచారించింది సిట్. మూడు రోజులుగా సాగుతున్న విచారణ తర్వాత.. 2025, ఆగస్ట్ 22వ తేదీన నారాయణస్వామిని అదుపులోకి తీసుకున్నది సిట్.
లిక్కర్ ఆర్డర్స్‌లో ఆన్ లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తీసుకురావటం, మద్యం పాలసీలో మార్పులపై నారాయణస్వామిని ప్రశ్నించింది సిట్. ఎవరి ఆదేశాలతో.. ఎవరి ఒత్తిడులతో లిక్కర్ పాలసీ మార్చారు.. లిక్కర్ పాలసీ మార్పులో ఎవరెవరు జోక్యం చేసుకున్నారు అంటూ అప్పటి మంత్రి నారాయణస్వామిని ప్రశ్నించారు సిట్ అధికారులు.
ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ కాకుండా కేవలం క్యాష్ పేమెంట్స్ విధానాన్ని ఎందుకు అమలు చేశారంటూ సిట్ అధికారులు ప్రశ్నించారు. కొత్త మద్యం పాలసీలో మంత్రిగా ఆయన పాత్ర ఏంటీ అనే వివరాలు రాబట్టారు. చిత్తూరులోని ఆయన ఇంట్లో మూడు రోజులుగా తనిఖీ చేసిన సిట్ అధికారులు.. ఆగస్ట్ 22వ తేదీన అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో మాజీ మంత్రి నారాయణస్వామి సరైన వివరాలు ఇవ్వకపోవటం.. సరైన సమాచారం చెప్పలేదు అంటున్నారు సిట్ అధికారులు. చిత్తూరులో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు.. విజయవాడ ఆఫీసుకు తరలించనున్నారు. ఏపీ లిక్కర్ కేసులో ఓ పొలిటికల్ లీడర్ ను సిట్ విచారించి అదుపులోకి తీసుకోవటం ఇదే..