భగవద్గీత పోటీల్లో శ్రీవాణి హైస్కూల్ విద్యార్థినికి సెకండ్ ప్రైజ్

భగవద్గీత పోటీల్లో శ్రీవాణి హైస్కూల్ విద్యార్థినికి సెకండ్ ప్రైజ్

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో భజరంగ్ దళ్– విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి భగవద్గీత కంఠస్థ పోటీలలో శ్రీవాణి హైస్కూల్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఈ కాంపిటీషన్ లో పాఠశాలకు చెందిన విద్యార్థిని కృష్ణవేణి రెండోస్థానంలో నిలిచారు.

ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ వినీతమ్మ మాట్లాడారు. విద్యార్థినిని అభినందించారు. శ్రీవాణి హైస్కూల్ లో ఆధునిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఈ బహుమతిని సాధించడం మరికల్ మండల కేంద్రానికి గర్వకారణం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.