
ఆర్ఆర్ఆర్ అంతర్జాతీయ అవార్డుల పండిన ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అని చెప్పాలి. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం, ఆస్కార్ కు నామినేటెడ్ కావడంతో డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. అయితే అంతటి ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ తీయడానికి స్పూర్తి రెండు సినిమాలని రాజమౌళి చెప్పడం గమనార్హం .
అందులో ఒకటి అలనాటి సూపర్ డూపర్ హిట్ మూవీ మాయాబజార్, రెండోది డైరెక్టర్ మెల్ గిబ్సన్ తీసిన ‘బ్రేవ్‌హార్ట్ ’ మూవీలని రాజమౌళి తెలిపారు. మాయాబజార్ లోని చాలా సన్నివేశాలు తనను ఆర్ఆర్ఆర్ తీయడానికి ఇన్సిపిరేషన్ అని అన్నారు. మాయాబజార్ లో అప్పట్లోనే చాలా మంది స్టార్లు కలిసి నటించారు. ఈ ప్రయోగంతోనే ఆర్ఆర్ఆర్ తీశానన్నారు. అలాగే కొమురం భీం సాంగ్ లో కొరడాతో కొట్టే సీన్ కు బ్రేవ్‌హార్ట్ లోని కొన్ని సీన్స్ స్ఫూర్తి అని అన్నారు.