ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో 14,582 పోస్టులు.. జీతం రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు..

ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో 14,582 పోస్టులు.. జీతం రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు..

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్​సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం అప్లికేషన్లు కోరుతున్నది. ఈ ఎగ్జామ్ ద్వారా భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థలు, ట్రిబ్యునళ్లలో గ్రూప్–బి, గ్రూప్–సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 

పోస్టులు: పే లెవల్–7 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్​స్పెక్టర్ ఆఫ్​ ఇన్​కమ్ ట్యాక్స్(సీబీడీటీ), ఇన్​స్పెక్టర్(సెంట్రల్ ఎక్సైజ్, సీబీఐసీ), ఇన్​స్పెక్టర్(ప్రివెంటీవ్ ఆఫీసర్), ఇన్​స్పెక్టర్(ఎగ్జామినర్), అసిస్టెంట్ ఎన్ ఫోర్స్​మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్​స్పెక్టర్(సీబీఐ), ఇన్​స్పెక్టర్(డిపార్ట్​మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్​ కమ్యూనికేషన్), ఇన్​స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్​నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్), సెక్షన్ హెడ్(డైరెక్టర్ జనరల్ ఆఫ్​ ఫారెన్ ట్రేడ్).

పే లెవల్–6 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్(ఎన్​హెచ్ఆర్ సీ), డివిజనల్ అకౌంటెంట్(కాగ్), సబ్ ఇన్​స్పెక్టర్(ఎన్ఐఏ), సబ్ ఇన్​స్పెక్టర్(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్(స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ మంత్రిత్వశాఖ), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2(హోంమంత్రిత్వశాఖ), ఆఫీస్ సూపరింటెండెంట్(సీబీడీటీ).

పే లెవల్–5 ఆడిటర్(కాగ్, సీజీడీఏ, వివిధ మంత్రిత్వశాఖలు), అకౌంటెంట్(కాగ్, కంట్రోలర్ జనరల్ ఆఫ్​ అకౌంట్స్, వివిధ మంత్రిత్వశాఖలు).
పే లెవల్–4 పోస్టల్ అసిస్టెంట్(సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్​స్పెక్టర్(సెంట్రల్ బ్యూరో ఆఫ్​ నార్కొటిక్స్, మినిస్ట్రీ ఆఫ్​ ఫైనాన్స్).

ఎలిజిబిలిటీ

జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతోపాటు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. 

స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్​లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
ఇతర అన్ని పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. వయోపరిమితి: పోస్టులను అనుసరించి 18 నుంచి 32 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ లకు10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.  

శాలరీ: పే లెవల్–7 (రూ.44,900 నుంచి రూ.1,42,400), పే లెవల్–6(రూ.35,400 నుంచి రూ.1,12,400), పే లెవల్–5(రూ.29,200 నుంచి రూ.92,300), పే లెవల్–4(రూ.25,500 నుంచి రూ.81,100)

అప్లికేషన్ లాస్ట్ డేట్: జులై 04.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఎగ్జామ్ సెంటర్స్: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఆంధ్రప్రదేశ్​లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు.

సెలెక్షన్ ప్రాసెస్ 

టైర్–2 ఎగ్జామ్​కు ఎంపిక కావాలంటే టైర్–1లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. టైర్–2లో సెక్షన్–1, సెక్షన్–2, సెక్షన్–3 ఉత్తీర్ణత సాధించాలంటే అన్​రిజర్వ్​డ్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 25 శాతం, ఇతర అభ్యర్థులు 20 మార్కులు సాధించాల్సి ఉంటుంది. 

స్కీమ్ ఆఫ్​ ఎగ్జామినేషన్

రెండంచెల పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైర్–1, టైర్–2 రెండింటికీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 

టైర్–1 ఎగ్జామ్ ప్యాటర్న్: టైర్–1 ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్​ రీజనింగ్(25 ప్రశ్నలు), జనరల్ అవేర్​నెస్(25 ప్రశ్నలు ), క్వాంటిటెటీవ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు), ఇంగ్లీష్​ కాంప్రహెన్షన్ (25 మార్కులు). గంట సమయంలో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్​ల్లో ఉంటుంది. 

టైర్–2 ఎగ్జామ్ ప్యాటర్న్: టైర్–2 ఎగ్జామ్​లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో సెక్షన్–1 లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ (30 ప్రశ్నలు), రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ (30 ప్రశ్నలు), సెక్షన్–2లో ఇంగ్లీష్​ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్(45 ప్రశ్నలు), జనరల్ అవేర్​నెస్ (25 ప్రశ్నలు) ఇస్తారు. సెక్షన్–3 కంప్యూటర్ నాలెడ్జ్ పై 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కులు.  

సెక్షన్–4లో  డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. పేపర్–2లో స్టాటిస్టిక్స్ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2 అర్హత సాధించిన వారికే పేపర్–2 ఎగ్జామ్ ఉంటుంది.