రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి షురూ అయి వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 306 సెంటర్ల లో 69,255 మంది రెగ్యులర్, 57 కేంద్రాల్లో 12,560 మంది ప్రైవేటు స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​కు హాజరవుతారు. ప్రతిరోజు ఉదయం 9 :30 నుంచి మధ్యాహ్నం 12 :30 వరకు పరీక్ష జరుగుతుంది. అధికారులు పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్​అమలులో ఉంటుంది. ఎగ్జామ్స్​ కేంద్రాల వద్ద జిరాక్స్​సెంటర్లు మూసి వేయాలి. 21 ఫ్లైయింగ్ స్వ్వాడ్ లు, అవసరమున్న చోట్ల సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల్లో అసవరమైన మంచినీరు, ఫ్యాన్లు తదితర మౌలిక వసతులు కల్పించారు. ఎగ్జామ్ సెంటర్ల లో పనిచేసే సిబ్బంది విధిగా గుర్తింపు కార్డులు ధరించాలి. పరీక్షల నిర్వహణ సిబ్బంది తప్పా బయటి వ్యక్తులు రావొద్దు. స్టూడెంట్స్​, సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో మొబైల్​ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దు . విద్యార్థులకు పరీక్షల సందేహాలు, సమస్యలపై జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసులో సంప్రదించవచ్చు. అవసరమైతే కంట్రోల్​ రూం నెంబర్ 040 29701474కు ఫోన్​ చేయొచ్చని జిల్లా విద్యాశాఖ తెలిపింది.


ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
టెన్త్‌‌ పరీక్షల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు గ్రేటర్ జోన్ ఆర్టీసీ తెలిపింది. శనివారం నుంచి ప్రారంభమవుతున్న పబ్లిక్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేందుకు నడుపుతున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బస్ స్టాప్ ల వద్ద విద్యార్థులకు రూట్ విషయంలో సూచనలు చేయడానికి, బస్సులు సమయానికి వస్తున్నాయా లేదా, స్టాప్ ల వద్ద ఆపుతున్నారా లేదా అని పర్యవేక్షించడానికి సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జోనల్ ఎన్‌ ఫోర్స్‌‌మెం ట్‌ స్క్వాడ్ వివిధ ప్రాంతాల్లో 6 జీపులతో ఉదయం ట్రాఫిక్ సమస్యలే రాకుండా పని చేస్తాయన్నారు. సందేహాల కోసం కమ్యూనికేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు కోఠి సెంటర్ 995226160, రేతిఫైల్ సెంటర్ 9959226154 నెం బర్లలో సంప్రదించాలని సూచించారు.