
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ ద్వారా పదోతరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగంలో చేరవచ్చు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 24.
పోస్టుల సంఖ్య: 1075
పోస్టులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్), హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 2025, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏండ్లు, హవల్దార్ పోస్టుకు 2025, ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 26.
లాస్ట్ డేట్: జులై 24 .
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
పరీక్ష తేదీ: 2025, సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు.
సెలెక్షన్ ప్రాసెస్: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హవల్దార్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ssc.gov.in వెబ్ సైట్ లో చూడగలరు.
ఎగ్జామ్ ప్యాటర్న్
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్టులో సెక్షన్–I, సెక్షన్–II ఉంటాయి. సెక్షన్-–Iలో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలకు 60 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 ప్రశ్నలకు 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. సెక్షన్-–IIలో జనరల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు 75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 75 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 270 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
సెక్షన్-–Iకు 45 నిమిషాలు, సెక్షన్-II 45 నిమిషాల సమయం ఇస్తారు. సెక్షన్-–Iలో నెగెటివ్ మార్కులు లేవు. సెక్షన్-–IIలో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. రాత పరీక్ష ఇంగ్లిష్, హిందీతో పాటు 13 రాష్ట్రీయ భాషల్లో నిర్వహిస్తారు.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్: సీబీఐసీ, సీబీఎన్ హవల్దార్ పోస్టులకు రాత పరీక్షతోపాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు కూడా ఉంటుంది. పురుష అభ్యర్థులు 15 నిమిషాల్లో 1600 మీటర్లు నడవాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 20 నిమిషాల్లో కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది.