రాణించిన స్టెఫానీ టేలర్‌.. 7 రన్స్‌‌ తేడాతో స్కాట్లాండ్పై విండీస్‌‌ విజయం

రాణించిన స్టెఫానీ టేలర్‌.. 7 రన్స్‌‌ తేడాతో స్కాట్లాండ్పై విండీస్‌‌ విజయం

లీడ్స్‌‌: విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో వెస్టిండీస్‌‌ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. స్టెఫానీ టేలర్‌‌ (19 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 47 నాటౌట్‌‌) మెరుపు ఇన్నింగ్స్‌‌కు అలీయా అలిన్‌‌ (3/11), హేలీ మాథ్యూస్‌‌ (3/19) బౌలింగ్‌‌లో చెలరేగడంతో.. గురువారం రాత్రి జరిగిన గ్రూప్‌‌–2 లీగ్‌‌ మ్యాచ్‌‌లో విండీస్‌‌ 7 రన్స్‌‌ తేడాతో స్కాట్లాండ్‌‌పై గెలిచింది.

టాస్‌‌ ఓడిన విండీస్‌‌ 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసింది. షిమానే క్యాంప్‌‌బెల్‌‌ (36) ఫర్వాలేదనిపించినా.. హేలీ మాథ్యూస్‌‌ (14), క్వియనా జోసెఫ్‌‌ (13), దియోంద్ర డాటిన్‌‌ (14), క్లాక్స్‌‌టన్‌‌ (16) నిరాశపర్చారు. కేథరిన్‌‌ ఫ్రెజర్‌‌ 2 వికెట్లు తీసింది. తర్వాత స్కాట్లాండ్‌‌ 20 ఓవర్లలో 146 రన్స్‌‌కే ఆలౌటైంది.

డార్సీ కార్టర్‌‌ (59), అలిసా లిస్టర్‌‌ (33), కేథరిన్‌‌ ఫ్రెజర్‌‌ (20) మినహా మిగతా వారందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌‌లో ఎనిమిది మంది సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. స్టెఫానీ టేలర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.