కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌: లవ్లీనాకు మెడల్‌‌ ఖాయం.. సెమీస్కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్

కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌: లవ్లీనాకు మెడల్‌‌ ఖాయం.. సెమీస్కు అర్హత సాధించిన స్టార్ బాక్సర్

గ్లాస్గో: కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో ఇండియా పతకాల ఖాతాను తెరిచింది. విమెన్స్‌‌ 75 కేజీల బాక్సింగ్‌‌ విభాగంలో స్టార్‌‌ బాక్సర్‌‌ లవ్లీనా బొర్గోహైన్‌‌ డైరెక్ట్‌‌గా సెమీస్‌‌కు అర్హత సాధించింది. దాంతో కనీసం కాంస్య పతకం ఖాయమైంది. మొత్తం ఐదుగురు బాక్సర్లు బరిలో ఉండగా, లవ్లీనాకు తొలి రౌండ్‌‌లో బై లభించింది. దాంతో ఆమె నేరుగా సెమీస్‌‌కు చేరింది. ఈ నెల 31న జరిగే సెమీస్‌‌లో లవ్లీనా.. టీకేబీపీ టాఫాకి (తువాల్‌‌)తో తలపడనుంది. 

గురువారం జరిగిన విమెన్స్‌‌ లాన్‌‌ బౌల్స్‌‌లో రూపా రాణి టిర్కే–పింకి టైబ్రేక్‌‌ 1–0తో రెబెకా లూయిస్‌‌ రిక్సన్‌‌–కొన్ని లీగ్‌‌ రిక్సన్‌‌ (మాల్టా)పై గెలిచారు. తొలి సెట్‌‌లో ఇండియా ద్వయం 7–1తో గెలిచింది. కానీ రెండో సెట్‌‌లో 3–4తో ఓడటంతో మ్యాచ్‌‌ టైబ్రేక్‌‌కు వెళ్లింది. టైబ్రేక్‌‌లో పింకి ఫైనల్‌‌ బాల్‌‌ను అద్భుతంగా త్రో చేసి విజయాన్ని అందించింది.  మరోవైపు గేమ్స్‌‌కు ముందే జూడోలో ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 

మెన్స్‌‌ 73 కేజీల్లో పోటీపడాల్సిన జోడో ప్లేయర్‌‌ అరుణ్‌‌ కుమార్‌‌ డోప్‌‌ పరీక్షలో ఫెయిలయ్యాడు. దాంతో అతనిపై అనర్హత వేటు పడింది. నాడా నిర్వహించిన ‘అవుట్‌‌ ఆఫ్‌‌ కాంపిటీషణ్‌‌’లో అరుణ్‌‌ నిషేధిత అనాబోలిక్‌‌ స్టెరాయిడ్‌‌ను తీసుకున్నట్లు తేలింది. ఇక డోపింగ్‌‌ ఉల్లంఘనల కారణంగా వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లోనూ ఇండియా కోటాను నిర్వాహకులు కుదించారు. 

గతంలో 16గా ఉన్న కోటాను 11కి తగ్గించారు. దాంతో వీపు గాయంతో బాధపడుతున్న లిఫ్టర్‌‌ దిల్‌‌బాగ్ సింగ్‌‌ను కామన్వెల్త్‌‌ నుంచి తప్పించారు. పారా స్విమ్మర్‌‌ తేజస్‌‌ నందకుమార్‌‌ కూడా అర్హత ప్రమాణాలు అందుకోలేక గేమ్స్‌‌ నుంచి వైదొలిగాడు.