రాజమౌళిని ప్రశంసించిన స్టార్ వార్స్‌‌‌‌ దర్శకుడు

రాజమౌళిని ప్రశంసించిన  స్టార్ వార్స్‌‌‌‌ దర్శకుడు

బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిని అందుకున్న రాజమౌళి, హాలీవుడ్‌‌‌‌లో ప్రెస్టీజియస్‌‌‌‌గా భావించే గవర్నర్స్‌‌‌‌ అవార్డ్స్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కి హాజరయ్యారు. ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు ఈ అవార్డుల వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. లాస్ ఏంజిల్స్‌‌‌‌ వేదిక‌‌‌‌గా ఆదివారం జ‌‌‌‌రిగిన ఈ అవార్డ్ వేడుక‌‌‌‌లో బ్లాక్ సూట్‌‌‌‌లో స్టైలిష్‌‌‌‌గా కనిపించారు రాజమౌళి.

స్టార్ వార్స్‌‌‌‌, మిషన్ ఇంపాజిబుల్ లాంటి భారీ హాలీవుడ్‌‌‌‌ చిత్రాల దర్శకుడు జె.జె.అబ్రమ్స్‌‌‌‌, రాజమౌళిని ప్రశంసించారు.  ‘ఆర్ఆర్ఆర్’కి తాను పెద్ద ఫ్యాన్‌‌‌‌ను అని, రాజమౌళిని కలవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. మరోవైపు తను మహేష్‌‌‌‌ బాబుతో తీయబోయే చిత్రం హాలీవుడ్ లో వచ్చిన ‘ఇండియానా జోన్స్‌‌‌‌’ తరహాలో అడ్వెంచర్‌‌‌‌‌‌‌‌ జానర్‌‌‌‌‌‌‌‌లో ఉంటుందని, తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారని రీసెంట్‌‌‌‌ ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి.