ఇవాళ్టి నుంచి ఆర్టీసీ పార్సిల్ సర్వీసులు

ఇవాళ్టి నుంచి ఆర్టీసీ పార్సిల్ సర్వీసులు

రాష్ట్రంలోని 140 బస్టాండ్లలో ఆర్టీసీ పార్సిల్‌ సర్వీసులు శుక్రవారం షురూ కానున్నాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఈ సర్వీసులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేజర్ బస్టాండ్లలో పార్సిల్‌ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో అదనంగా ఉన్న కండక్టర్లు, డ్రైవర్లలో 550 మందిని దీనికి ఉపయోగించుకోనున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, కరీంనగర్‌, వరంగల్‌ లాంటి చోట్ల సిబ్బందికి మూడు షిఫ్టులు, చిన్న బస్టాండ్లలో రెండు షిఫ్టులు ఉంటాయి. పార్సిల్ సర్వీసులకు సంబంధించిన రేట్లను శుక్రవారం మంత్రి పువ్వాడ ప్రకటిస్తారు.