
500 మంది విద్యార్థులకు సరిపడేలా జీ+3 అంతస్తుల్లో నిర్మాణం
రూ.39.50 కోట్లు కేటాయింపు
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, యూనివర్శిటీ వీసీ రవీందర్ పాల్గొన్నారు.
క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం కల్పించడం కోసం యూనివర్సిటీలో మరో నూతన హాస్టల్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం రూ.39.50 కోట్లు కేటాయించారు. క్యాంపస్‌లో 500 మంది విద్యార్థులు ఒకే భవనంలో ఉండే విధంగా డిజైన్ నిర్ణయించారు. జీ+3 అంతస్తులతో దీనిని నిర్మిస్తున్నారు. హాస్టల్ భవనం నిర్మించడంతో పాటు ఇంటర్నల్ వాటర్ సదుపాయం, శానిటరీ విధానం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నల్ ఎలక్ట్రికల్‌ను ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు (టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ) అప్పగించినట్లు ఓయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ తెలిపారు.