Balakrishna: 'అఖండ 2 తాండవం' బ్లాస్టింగ్ సర్ప్రైజ్.. బోయపాటి మాస్ యాక్షన్ ప్లాన్ రెడీ!

 Balakrishna: 'అఖండ 2 తాండవం' బ్లాస్టింగ్ సర్ప్రైజ్.. బోయపాటి మాస్ యాక్షన్ ప్లాన్ రెడీ!

నందమూరి బాలకృష్ణ అభిమానులు, సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘అఖండ 2 తాండవం’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి మేకర్స్ బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా, ఏకంగా రూ150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇది తెలుగు సినిమా పరిశ్రమలోనే అత్యంత భారీ నిర్మాణాలలో ఒకటిగా నిలవనుంది.

థియేటర్లలో 'అఖండ' సర్ప్రైజ్!
'అఖండ 2' గురించిన మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. మొదటి భాగంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అఖండ పాత్రకు సంబంధించి, దర్శకుడు బోయపాటి శ్రీను ఒక బ్లాస్టింగ్ సర్ప్రైజ్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా పతాక సన్నివేశాల్లో బాలయ్య చేసే పరమశివుని తాండవం ప్రేక్షకులను ఒక రకమైన ట్రాన్స్‌లోకి, ఉద్వేగభరితమైన అనుభూతిలోకి తీసుకెళ్లడం ఖాయమని సినీ సర్కిల్స్‌లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్‌ను మించిన యాక్షన్, మాస్ సన్నివేశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన యువ నటి సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, పవర్ ఫుల్ నటుడు ఆది పినిశెట్టి , బాలీవుడ్ బాల నటి హర్షాలి మల్హోత్రా (బజరంగీ భాయిజాన్ ఫేమ్) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 

'అఖండ'కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన ఎస్. థమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య – బోయపాటిల హ్యాట్రిక్ కాంబినేషన్ ఈసారి ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.