హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సీఈవో(చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్) వికాస్ రాజ్ బుధవారం పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. 2వ ప్రత్యేక సమ్మరీ రివిజన్, బీఎల్ వోల ద్వారా ఇంటింటికి సర్వే, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఆగస్ట్ 2న పోలింగ్ స్టేషన్ల వివరాలు.. అక్టోబర్ 4న ఫైనల్ ఓటర్ లిస్ట్ వెల్లడిస్తామని సీఈవో తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ స్టేషన్‌లలో నమోదు చేసుకోవడం వంటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. జంట నగరాలల్లోని కాలనీలు, బస్తీ ఆధారిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
