సెక్రటేరియట్ పర్మిషన్ కు ఢిల్లీలో చక్కర్లు

సెక్రటేరియట్ పర్మిషన్ కు ఢిల్లీలో చక్కర్లు
  • మూడు రోజులుగా అక్కడే మంత్ర ప్రశాంత్ రెడ్డి మకాం
  • బిల్డింగ్ నిర్మించేందకు కేంద్రం అనుమతి తప్పనిసరి
  • పర్మిషన్ వచ్చాకే కడుతామని హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర సర్కార్
  •  అవసరమైతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్
  • హుస్సేన్ సాగర్ పక్కన ఎత్తయిన కట్టడాలకు అనుమతి కష్టమే!
  • కొత్త సెక్రటేరియట్ ఎత్తు 278 అడుగులు

కొత్త సెక్రటేరియట్ కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోషీష్ చేస్తుంది. మూడు రోజులుగా మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు.సెక్రటేరియట్ డిజైన్ తో పాటు నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ,పొల్యూసన్ కంట్రోల్  బోర్డు ఇచ్చిన అనుమతులను ఆయన తన వెంట తీసుకెళ్లినట్లు తెలిసింది. కేంద్ర పర్యావరణ శాఖ ఆఫీస్లను మంత్ర కలుస్తారని కొందరు ఆఫీసర్లు వెల్లడించారు. ప్రశాంత్ రెడ్డితో పాటు ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్  వినోద్ కుమార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

పట్టుదలగా కేసీఆర్

సెక్రటేరియట్ విషయంలో సీఎం కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నారని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పర్మిషన్ ఆలస్యమైతే ఆయనే ఢిల్లీ కి వెళ్లి కేంద్రాన్నిఒప్పించొచ్చని చెబుతున్నారు. ఈ విషయంలోకేంద్ర పర్యావ రణ శాఖ మంత్రి జవదేకర్తో ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని వారు అంటున్నారు. గతంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల కోసం కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయనిలీడర్లు గుర్తుచేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్లానింగ్ బోర్డువైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎవరెవ ర్ని కలువాలో డైరెక్షన్ ఇస్తున్నట్టు వారు చెబుతున్నారు.

పాతదానికి అవసరం లేదన్నరు.. కొత్తదానికి తప్పదు

కొత్తసెక్రటేరియట్ నిర్మాణ పనులు మొదలుపెట్టే ముందు కేంద్రం అనుమతి తీసుకుంటామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. పాత సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేత కేసు విచారణ టైంలో ఈ విషయాన్ని చెప్పింది. బిల్డింగ్ కూల్చివేతకు పర్యావరణ శాఖ పర్మిషన్ అవసరం లేదని, కొ త్తగా నిర్మించే దానికి అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ వివరణను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ స్పందిస్తూ.. కొత్త బిల్డింగ్ కోసం భూమిని మాత్రమే రెడీ చేస్తున్నా మని, బిల్డింగ్ కట్టడానికి అవసరమైన అనుమతులు తీసుకున్నాకే పనులు చేపడుతామని స్పష్టం చేశారు. దీంతో కేంద్రంనుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే కొత్త సెక్రటేరియట్ నిర్మాణం స్టారవు్ట తుందని ఆఫీసర్లు అంటున్నారు.

ఎత్తయిన కట్టడాలకు పర్మిషన్ కష్టమే!

హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఎత్తయిన కట్టడాలు చేపట్టడానికి అనుమతులు అంత ఈజీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హుస్సేన్సాగర్ చుట్టూ పక్కల ఎత్తయిన నిర్మాణాలు చేపట్టవద్దని ఇప్పటికే కోర్టు తీర్పులు ఉన్నాయి. దీంతో ట్యాంక్ బండ్ సమీపంలో ఎక్కడ కూడా అలాంటి నిర్మా ణాలు కనిపించవు. సెక్రటేరియట్ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్థూపం, భవనం నిర్మించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ట్యాంక్ బండ్ పక్కన సిమెంట్ , ఇసుకతో శాశ్వత నిర్మాణం చేపడితే పర్యావరణ సమస్యలు తలెత్తుతాయనే అభ్యంతరాలు రావడంతో.. డిజైన్ మేరకు బయట ఐరన్ రాడ్స్ తయారు చేసి నిర్మిస్తున్నారు.

278 అడుగుల ఎత్తులో న్యూ సెక్రటేరియట్

దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 3 ఎకరాల్లోనే న్యూ సెక్రటేరి యట్ బిల్డింగ్ కట్టాలని డిజైన్ చేశారు. 7 అంతస్తుల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే బిల్డింగ్ డిజైన్ కు ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. అయితే మొత్తం బిల్డింగ్ ఎత్తు.. అంటే బిల్డింగ్ పై ఏర్పాటు చేసే డోమ్ వరకు 278 అడుగుల ఎత్తులో ఉంటుంది. హుస్సేన్ సాగర్ పక్కన ఇంత ఎత్తు నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంత రం చెప్పే అవకాశం ఉందని ఆఫీసర్లు అంటున్నారు.

 అందుకే టెండర్లు ఆలస్యమా?

పాత సెక్రటేరియట్కూల్చివేతలు పూర్తవగానే కొత్తసెక్రటేరియట్ కోసం టెండర్లుపిలవాలని సీఎం ఆదేశించారు. కూల్చివేతలు పూర్తయి దాదాపు 15 రోజులు అవుతోంది. శిథిలాలను కూడా తరలించారు. అయినా ఇం తవరకు టెండర్లప్రాసెస్ మొదలవ్వలేదు. ముందుగా టెండర్లు పిలిచి, ఆ తర్వాత కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తీసుకుంటే ఎలా ఉంటుందనే చర్చ ప్రభుత్వంలో జరిగినట్టు తెలిసింది. అయితే చివరకు, పర్యావరణ పర్మిషన్ లేకుండా టెండర్లు పిలిస్తే మళ్లీలీగల్సమస్యలు వస్తాయనే అంచనాకు వచ్చింది. దీంతో న్యూ సెక్రటేరియట్డిజైన్ ను కేంద్ర పర్యా వరణ శాఖ అనుమతి కోసం పంపింది. అక్కడినుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకు టెండర్లు పిలిచే చాన్స్ లేదని ఆఫీసర్లు అంటున్నారు.