బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దక్షిణ థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలకు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఇప్పటివరకూ వరదల వల్ల 33 మంది చనిపోయారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు నీట మునిగాయి. దాదాపు 27 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. బుధవారం వరద నీరు తగ్గడం ప్రారంభించింది.
అయితే, మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని థాయ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సదరన్ థాయ్ లాండ్లో అతిపెద్ద నగరమైన హత్ యాయ్ను వరదలు ముంచెత్తాయి. ఇండ్లు, వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండ్లు, బిల్డింగులపైకి ఎక్కారు. ఇక, ప్రధాని అనుతిన్ చర్న్ విరాకుల్.. సోంగ్ ఖ్లా ప్రావిన్స్ కు ఎమర్జెన్సీ ప్రకటించారు. కాగా, ఇండోనేషియాలోనూ భారీ వర్షాల కారణంగా 17 మంది చనిపోయారు.
