నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

సమ్మెపై సర్కారు తీరుకు నిరసనగా  ట్రేడ్ యూనియన్ల పిలుపు

హైదరాబాద్‌, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఆదివారం హైదరాబాద్‌ హిమాయత్‌ నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.

2017 ఏప్రిల్‌ నుంచి అమలు కావాల్సిన వేతన సవరణ, ఉద్యోగ భద్రత, తదితర డిమాండ్ల సాధనకు 9 రోజులుగా దాదాపు 50 వేల మంది కార్మికులు సమ్మె చేస్తుంటే వారిపై ప్రభుత్వం దాడులు చేయడం దారుణమన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులతో దాడులు, డిస్మిస్, 144 సెక్షన్ల పేరిట ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందన్నారు.