హైదరాబాద్, వెలుగు: నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న ఇన్ ఫ్లుయెన్సర్ అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడీబ్ల్యూ) ను రాష్ట్ర మహిళా కమిషన్ కోరింది. మహిళలను కించపరుస్తూ సదరు యూట్యూబర్ అసభ్యకరమైన వీడియోలను ప్రసారం చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎన్ సీడబ్ల్యూకు రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది.
పిల్లల హక్కులకు భంగం కలిగించేలా చట్టవిరుద్ధమైన కంటెంట్ అప్ లోడ్ చేస్తున్నాడని కంప్లైంట్స్ వచ్చాయని తెలిపింది. హిందూ దేవతలపైనా అత్యంత అభ్యంతరకరంగా, భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడని కమిషన్ పేర్కొంది. ఇలాంటి కంటెంట్ నైతికతను, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని కమిషన్ అభిప్రాయపడింది.
