వనపర్తి జిల్లాలో పిల్లి దేవత విగ్రహం

వనపర్తి జిల్లాలో పిల్లి దేవత విగ్రహం

హైదరాబాద్ : వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో పిల్లి దేవత విగ్రహం వెలుగుచూసింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బైరోజు శ్యామ్​సుందర్, చంద్రశేఖర్ గుర్తించారు. నేలబిల్కు, పెద్ద బిల్కు, గూడెం ఊర్లు కలిసి బెక్కెం ఏర్పడింది. బెక్కెం అనే పేరు రావడానికి స్థానికులు ఒక కథ చెబుతుంటారు. అక్కడి తాటివనంలోని పుట్ట మీద ఒక ఆవు పాలు కురిపిస్తుంటే, పిల్లి వాటిని తాగడం చూసినవారు పుట్టను తవ్వగా శివలింగం బయటపడింది.

ఆ లింగానికే గుడి కట్టి బెక్కేశ్వరుడు అని పేరు పెట్టి పూ జించారు. కన్నడంలో బెక్కు అంటే పిల్లి. పిల్లి పేరు మీదుగానే ఆ గ్రామానికి బెక్కెం అనే పేరు వచ్చి ఉంటుం దని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు చెబుతున్నారు. అభిప్రాయపడ్డారు. పిల్లి దేవత విగ్రహంపై పార్వతిదేవి విగ్రహం కూడా ఉంది.