
హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్‌కు తేల్చిచెప్పింది. ఈ మేరకు బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది.
బనకచర్ల ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలించాల్సి ఉందని.. ఈ మేరకు సీడబ్ల్యూసీని అప్రోచ్ కావాలని ఏపీకి సూచించింది. సీడబ్ల్యూసీతో కలిసి ఫ్లడ్ వాటర్ అవేలబులిటి అస్సెస్ చేయాలని పేర్కొంది. అంతరాష్ట్ర జల వివాదానికి క్లియరెన్స్ తెచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌కు సూచించింది.
ALSO READ | వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యం: MLA రాజాసింగ్‌పై బీజేపీ సీరియస్
కాగా, ఏపీ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి చాలా ఫిర్యాదులు అందాయి. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని.. వెంటనే ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్రానికి ఫిర్యాదులు చేసింది. ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్ట్ కోసం ఏపీ పంపిన ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ పరిశీలించింది.
బనకచర్ల ప్రాజెక్ట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కమిటీ.. అనుమతులు ఇవ్వడానికి తిరస్కరించింది. బనకచర్ల ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే గోదావరి ట్రిబ్యూనల్ తీర్పు పరిశీలించాల్సి ఉందని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతుల కోసం సీడబ్ల్యూసీని సంప్రదించడం తప్పనిసరని పేర్కొంది. బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి ట్రిబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయని కమిటీ వెల్లడించింది.