భారీ వర్షాలు పడతాయి.. 24 గంటలు ఇంట్లోనే ఉండండి : సుఖ్‌విందర్ సింగ్

భారీ వర్షాలు పడతాయి.. 24 గంటలు ఇంట్లోనే ఉండండి : సుఖ్‌విందర్ సింగ్

 హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు  కురుస్తున్న క్రమంలో ప్రజలు బయటకు రావొవద్దని  ఆ రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్ సింగ్  సూచించారు.   రాబోయే 24 గంటలు ఇళ్లలోనే ఉండి అధికారులకు సహకరించాలని కోరారు. అత్యవసరమైతే 1100, 1070 , 1077 అనే మూడు హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించాలని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. రాష్ట్రంలో కురుస్తోన్న  భారీ వర్షాలకు 14 మంది మరణించారని సీఎం సుఖ్‌విందర్ సింగ్ తెలిపారు.  శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.   

 

హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు, భవనాలు కూలిపోయి అపారమైన నష్టాన్ని కలిగించాయి. ఇప్పటికే వాతవారణ శాఖ అధికారులు 13 జిల్లాల్లో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని బియాస్, చీనాబ్, రావి, సట్లూజ్, స్వాన్ వంటి ప్రధాన నదుల్లో నీటి మట్టాలు పెరిగాయి.  2023 జూన్ 1 నుండి జూలై 9 వరకు హిమాచల్‌లో 271.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది