
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనీ నర్సు ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ 30.
పోస్టులు: 53 (ట్రైనీ నర్స్)
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నర్సింగ్ లో బీఎస్సీ లేదా జనరల్ నర్సింగ్ అండ్ మెటర్నిటీ ట్రీట్మెంట్ హెల్పింగ్లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. బీఎసీ (నాన్ క్రిమిలేయర్) 33 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: జూన్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు sailcareers.com వెబ్సైట్లో చూడగలరు.