వందే భారత్ ఎక్స్ ప్రెస్పై రాళ్ల దాడి

వందే భారత్ ఎక్స్ ప్రెస్పై రాళ్ల దాడి

వందే భారత్ ఎక్స్‌ప్రెస్  రైళ్లపై రాళ్ల దాడి కొనసాగుతూనే ఉంది. దేశంలో అనేక ప్రాంతాల్లో దుండగులు వందే భారత్ రైళ్లపై దాడులు చేస్తున్నారు. తాజాగా మైసూరు -చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైల్పై రాళ్ల దాడి చేశారు.  క్రిష్ణరాజపురం -బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా.. రైల్పై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడిలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది.

తెలంగాణలోనూ  వందే భారత్ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో రైలు వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్ల దాడి చేశారు. అటు  పశ్చిమ బెంగాల్‌లోనూ వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. దేశవ్యాప్తంగా ఇతర రైళ్లపై కూడా అనేక చోట్ల రాళ్ల దాడి జరుగుతోంది.