హ్యాట్సాఫ్ నరేష్

హ్యాట్సాఫ్ నరేష్

నోటిఫికేషన్ పడితే.. సిలబస్​కు అనుగుణంగా బుక్స్ తెచ్చుకుని చదివేటోళ్లే ఎక్కువ. అందరూ అకాడమి లేదంటే స్టాండర్డ్ బుక్స్​ను నమ్ముకుంటారు.. కానీ నరేశ్ వీరందరి కంటే  డిఫరెంట్​ ..  కొత్తగా ఆలోచించాడు. కొత్తగా ప్రిపేరయ్యాడు.

న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, అకాడమి బుక్స్, స్కూల్ బుక్స్  నాలుగైదు రకాల మెటీరియల్​ చదివి తనే సొంతంగా  నోట్స్ రాసుకున్నాడు. వాటి​తో 25  పుస్తకాలు తయారు చేశాడు.

ఫస్ట్ క్లాస్ నుంచి ఎకనామిక్స్ పీజీ వరకు తను చదివిన పుస్తకాలన్నీ రిఫర్ చేశాడు.  ఇటీవల టీఎస్​పీఎస్​సీ వెల్లడించిన గ్రూప్ 2 ఫలితాల్లో
స్టేట్​ ఫస్ట్ ర్యాంక్​ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఖమ్మం జిల్లా జిన్నారం మండలం ఏన్కూర్ కు చెందిన ఉదారప నరేష్​  ప్రస్తుతం ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో గవర్నమెంట్​ స్కూల్​ టీచర్​గా పని చేస్తున్నాడు. రెండేళ్లుగా తను ఎంచుకున్న స్టడీ మెథడ్​ .. ప్రిపరేషన్ జర్నీని  ‘వెలుగు సక్సెస్‌‌’తో పంచుకున్నారు..

‌‌‌‌- ఇబ్రహీంపట్నం, వెలుగు

8  గంటలకు బుక్ పట్టుకుంటే రాత్రి 2గంటల వరకు చదివేటోన్ని.  తింటే నిద్రొస్తుందని అప్పటివరకు తినకుండా చదివిన. ఒక ఏడాదిపాటు ఇలాగే ప్రిపేరైన. స్కూల్​కు సెలవుంటే 13 నుంచి 14 గంటలు చదివిన.  సమ్మర్ హాలిడేస్ కూడా ప్రిపరేషనే. నోటిఫికేషన్​ పడ్డప్పటి నుంచి గ్రూప్‌–2 ఎగ్జామ్ రాసే వరకు ఒక్క పండక్కి, ఫంక్షన్‌కి అటెండ్ కాలేదు. ఇంటర్వ్యూ అటెండ్​ అయ్యే ముందు  నేనే క్వశ్చన్ వేసుకుని నేనే ఆన్సర్ రాసుకునేటోన్ని. ఇంటర్వ్యూలో ఫ్రొఫెషన్, హాబీస్ గురించి అడిగారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఆన్సర్​ చేసిన.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి  సిలబస్ ప్రకారమే గ్రూప్–2 కోచింగ్ తీసుకున్న. పాత పద్ధతిలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన.  కొత్త రాష్ట్రం  రాగానే  సిలబస్ మారింది. ఎగ్జామ్ తెలంగాణ దృక్కోణంలో జరుగుతుందని అర్థమైంది. కొత్తగా తెలంగాణ ఉద్యమం పేపర్ రావడంతో 2009 నుంచి 2014 వరకు అన్ని పేపర్ల ఎడిటోరియల్స్, స్టోరీలు కలెక్ట్ చేసిన. పొద్దున్నే లేచి ఇబ్రహీంపట్నం లైబ్రరీకి వెళ్లడం పేపర్ క్లిప్పింగ్స్ తెచ్చుకోవటం ఇదే పని. దీనికితోడు తెలుగు అకాడమి బుక్స్​ చదివి ఉద్యమం మీద సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసిన.  ఎకానమీ కోసం ఇండియా, తెలంగాణ ఎకనామిక్ సర్వే అండ్​ గ్లాన్స్ బుక్ రిఫర్ చేసిన.  ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉన్న సోషల్ పుస్తకాలన్నీ తిరగేసిన. ఇలా నా సొంత హ్యాండ్ రైటింగ్‌‌‌‌‌‌‌‌తో 25 పుస్తకాలు తయారుచేసుకున్న.

డీఎస్సీలోనూ జిల్లా ఫస్ట్

2012 డీఎస్సీలో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.  ఇబ్రహీంపట్నం మండలం జడ్పీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ పోచారంలో సోషల్ టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా జాయినైన.  స్కూల్​ నుంచి ఇంటికెళితే..  8  గంటలకు బుక్ పట్టుకుంటే రాత్రి 2గంటల వరకు చదివేటోన్ని.  తింటే నిద్రొస్తుందని అప్పటివరకు తినకుండా చదివిన. ఒక ఏడాదిపాటు ఇలాగే ప్రిపేరైన. స్కూల్​కు సెలవుంటే 13 నుంచి 14 గంటలు చదివిన.  సమ్మర్ హాలిడేస్ కూడా ప్రిపరేషనే. నోటిఫికేషన్​ పడ్డప్పటి నుంచి గ్రూప్‌‌‌‌‌‌‌‌–2 ఎగ్జామ్ రాసే వరకు ఒక్క పండక్కి, ఫంక్షన్‌‌‌‌‌‌‌‌కి అటెండ్ కాలేదు. ఇంటర్వ్యూ అటెండ్​ అయ్యే ముందు  నేనే క్వశ్చన్ వేసుకుని నేనే ఆన్సర్ రాసుకునేటోన్ని. ఇంటర్వ్యూలో ఫ్రొఫెషన్, హాబీస్ గురించి అడిగారు. చాలా కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌గా ఆన్సర్​ చేసిన. నేను అనుకున్నట్లే  డిప్యూటీ తహసీల్దార్ జాబ్ వచ్చింది. టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంటా అనుకున్న. కానీ స్టేట్ ఫస్ట్ వస్తానని అనుకోలేదు. రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ రాకముందే .. నాకు జాబ్‌‌‌‌‌‌‌‌ వస్తుందని నమ్మిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న. టార్గెట్ పెట్టుకుని పద్దతి ప్రకారం ప్రిపేరైతే  గ్రూప్​ 2 సర్వీస్​ వచ్చి తీరుతుందని నేనైతే నమ్మకంగా చెబుతున్న.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– ఇబ్రహీంపట్నం, వెలుగు

కాన్సెప్ట్, బిట్స్

పేపర్–1లో 12 అంశాలు ఉన్నప్పటికీ 4 నుంచి 5 అంశాలు మాత్రమే చదువుకోవాలి. మిగిలినవి పేపర్–2, 3, 4లో భాగంగా చదువుకుంటాం. జనరల్ సైన్స్, కరెంట్ ఎఫైర్స్, మ్యాథ్స్ రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి మాత్రమే స్పెషల్‌‌‌‌గా చదివిన.  కరెంట్ ఎఫైర్స్ కోసం రోజుకు రెండు పేపర్లు చదివిన.   కరెంట్ ఎఫైర్స్ పెద్ద సముద్రం లాంటింది.  దాన్ని  ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి చదివిన. సిలబస్‌‌‌‌ను ముందుగా కాన్సెప్ట్, బిట్స్‌‌‌‌గా డివైడ్ చేసుకున్న.  కాన్సెప్ట్‌‌‌‌ల కోసం అకాడమి బుక్స్, గవర్నమెంట్ అఫిషియల్ సర్వేలు, స్కూల్ పుస్తకాలు ఎంచుకున్న.  బయట దొరికే పుస్తకాల్లో  బిట్స్ ప్రాక్టీస్ చేసిన.  టైం టేబుల్ పెట్టుకుని చదివిన. కాంపిటీటివ్‌లో వంద శాతం పేపర్ చేయలేం. కానీ మన ఎఫర్ట్ వంద శాతం ఉండాలి. స్టాండర్డ్ బుక్స్ తీసుకుని చదివి ఎక్కువసార్లు రివిజన్ చేస్తే జాబ్ గ్యారంటీ. ఇన్ని గంటలు చదవాలని లేదు.  మైండ్‌కి ఎంత పని చెప్తామో అంతే రెస్ట్ ఇవ్వాలి అనుకునేదాన్ని.   న్యూస్ పేపర్ చదివి క్లిప్పింగ్స్ కట్ చేసుకున్నా.  గ్రూప్‌–2 ప్రిపేరయ్యేవాళ్లందరికీ ఒకటే చెప్తా. సిలబస్ అర్థం చేసుకుని స్టాండర్డ్ బుక్స్ చదవాలి.  బిట్లుగా కాకుండా సబ్జెక్ట్ చదవాలి. ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు.  కాన్ఫిడెంట్‌గా చదవండి.