తెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్

తెలంగాణలో వారం రోజుల్లోనే పది ఫలితాలు.. డేట్ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ డేట్ ఎస్ఎస్ సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 30 (మంగళవారం) ఉదయం 11 గంటలకు పది పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరిగాయి. వాటిలో రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 08వేల 385 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

లోక్ సభ ఎన్నికల కారణంగా గత ఏడాది కంటే ఆసారి పదో తరగతి పరీక్షా ఫలితాలు ముందుగా విడుదల చేయనున్నారు. తెలంగాణతో 19 కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ పేపర్ల వ్యాల్యూయేషన్ త్వరగా పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఇంటర్ ఫలితాలు కూడా ఏప్రిల్ 24 (రేపు) విడుదల కానున్నాయి.