రూల్స్‌‌‌‌ ప్రకారమే స్త్రీ నిధి నియామకాలు.. హై లెవల్ కమిటీ పర్యవేక్షణలోనే  భర్తీ ప్రక్రియ  : స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌‌‌‌రెడ్డి

రూల్స్‌‌‌‌ ప్రకారమే స్త్రీ నిధి నియామకాలు.. హై లెవల్ కమిటీ పర్యవేక్షణలోనే  భర్తీ ప్రక్రియ  : స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌‌‌‌రెడ్డి
  • రోస్టర్, రిజర్వేషన్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పక్కాగా పాటించాం : స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు : స్త్రీ నిధి సంస్థలో నియామకాలు, పదోన్నతులు పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాలు, సంస్థ హెచ్ఆర్ పాలసీ ప్రకారమే జరుగుతాయని ఆ సంస్థ ఎండీ విద్యాసాగర్‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. స్త్రీనిధిలో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాతే రెండు నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ కమిటీలో ఫైనాన్స్‌‌‌‌ సెక్రటరీ, ఐటీ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారని, వారి ఆదేశాల మేరకే నియామకాలు జరిగాయని వివరించారు.

ఈ నియామకాల్లో రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎలాంటి అక్రమాలు, పక్షపాత చర్యలు జరగలేదని స్పష్టం చేశారు. గతేడాది ఏప్రిల్ నెలలో కేవలం 13 మందిని మాత్రమే క్రమబద్ధీకరించామని, వీరంతా ఏడు నుంచి ఎనిమిదేండ్లుగా సంస్థలో పని చేస్తున్నారని చెప్పారు. స్త్రీ నిధి ఒక ఆర్థిక సంస్థ అయినందున ఐటీ, ఫండ్స్, బ్యాంకింగ్ రంగాల్లో నైపుణ్యం ఉన్న నిపుణుల అవసరం ఉంటుందని, అందుకే హెచ్ఆర్ పాలసీ ప్రకారం, రూల్స్‌‌‌‌కు అనుగుణంగా వారి జీతభత్యాలను నిర్ణయించామని చెప్పారు.