పోర్ట్ ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పాకిస్తాన్ దీటుగా ఆడుతోంది. అబ్దుల్లా షఫీక్ (144 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (88) నిలకడగా ఆడటంతో.. 266/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన పాక్ కడపటి వార్తలందేసరికి రెండో ఇన్నింగ్స్‌లో 100 ఓవర్లలో 349/6 స్కోరు చేసింది.
అజాన్ ఓవైస్ (55) హాఫ్ సెంచరీ చేసినా, ఇమామ్ ఉల్ హక్ (14), అవైస్ జాఫర్ (1), సల్మాన్ ఆగా (0) నిరాశపర్చారు. షఫీక్, బాబర్ మూడో వికెట్‌కు 168 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అబ్దుల్లాతో పాటు సాజిద్ ఖాన్ (20 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం పాక్ 5 రన్స్ ఆధిక్యంలో ఉంది. జోమైల్ వారికన్ 3, షామేర్ జోసెఫ్ 2 వికెట్లు తీశారు
