హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ‘బీ ఎ హీరో, అడాప్ట్, డోంట్ షాప్’ అనే నినాదంతో శనివారం ఉదయం 9:30 గంటలకు కేబీఆర్ పార్కులో స్ర్టీట్ డాగ్స్ దత్తత కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరుకానున్నారు. వీధి కుక్కలను పెంచుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
