5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా బడంగ్ పేట్ పరిధిలో 5 సంవత్సరాల బాబుపై వీధి కుక్కల దాడి చేశాయి. మార్చి 25 శనివారం గుర్రం గూడ  టీచర్స్ కాలనీలోని పకృతి అపార్ట్మెంట్ వాచ్ మెన్ కుమారుడు నాని (5 సంవత్సరాలు) ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాబును వెంటనే నారాయణగూడ ఆసుపత్రికి తరలించారు.

వేసవి కాలం ఎండలు తీవ్రం కావడంతో అధిక ఉష్ణోగ్రతలతో వీధి  కుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తున్నాయి.. చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్నాయి.. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని.. కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువైందంటున్నారు స్థానిక ప్రజలు. మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకొని మళ్లీ అదే ప్రాంతంలో వదిలేయడం జరుగుతుందని చెబుతున్నారు. కాలనీలలో కుక్కలు ఎక్కువ కావడంతో పిల్లల్ని ఒంటరిగా బడికి పంపాలంటే భయం వేసిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో వీధి కుక్కలు వెంట పడుతున్నాయని వాపోతున్నారు.

ఇటీవల మీర్ పేట్ డైనమిక్ కాలనీలో కూడా 5 సంవత్సరాలు బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. నగరంలో వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.