జనగామ, వెలుగు : అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ తరలింపుపై ఆయన రివ్యూ నిర్వహించారు. రూల్స్ ప్రకారమే అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాలకు తరలించే ఇసుకకు కూడా ఈ రూల్స్వర్తిస్తాయని చెప్పారు.
అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మీటింగ్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీపీవో వెంకట్ రెడ్డి, ఏడీ మైన్స్ విజయ్ కుమార్, ఆర్టీవో శ్రీనివాస్ గౌడ్, నీటి పారుదల శాఖ అధికారి ప్రవీణ్ ఉన్నారు.

