దసరా పండుగకు ఊరెళ్తున్నారా.. జరభద్రం

దసరా పండుగకు ఊరెళ్తున్నారా.. జరభద్రం

బతుకమ్మ, దసరా, మిలాద్ ఉన్ నబీ పండుగల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దసరాకు ఊరికి వెళ్తున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దసరా పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని సీపీ తెలిపారు. దీనిపై ప్రజలకు ఇప్పటికే పలు సూచనలు చేశామని చెప్పారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 700 దేవి ప్రతిమలు ప్రతిష్టించారని.. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. నిమజ్జనానికి సంబంధించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు పోస్టులపై నిఘా ఉంచినట్లు తెలిపారు.