వాటర్​ఫాల్స్​లో మునిగి  స్టూడెంట్ ​మృతి

V6 Velugu Posted on Oct 20, 2021

వాటర్​ఫాల్స్​లో మునిగి  స్టూడెంట్ ​మృతి
పెద్ద​అంబర్​పేట ఓఆర్​ఆర్​ వద్ద ఘటన

ఎల్​బీనగర్,వెలుగు:  ఈత సరదా ఓ స్టూడెంట్​ప్రాణం తీసిన ఘటన పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో జరిగింది. రంగారెడ్డి జిల్లా మన్నెగూడకు చెందిన పోతనపల్లి ప్రణిత్(18) డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఫ్రెండ్స్​తో  కలిసి పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న వాటర్ ఫాల్స్ కు మంగళవారం సాయంత్రం వెళ్లారు. ప్రణిత్​కు ఈత రాకపోడంతో మునిగిపోగా, ఫ్రెండ్స్​కాపాడే ప్రయత్నం చేసినా ఫలితంలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వానలతో వాటర్ ఫాల్స్ వస్తుండడంతో జనాల రద్దీ పెరిగింది. అక్కడ ప్రమాదకరంగా ఉండగా  పోలీసులు, అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. 

Tagged Hyderabad, death, Student, Waterfalls,

Latest Videos

Subscribe Now

More News