
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూలో పీజీ చేస్తున్న యువకుడు మిస్సయ్యాడు. కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఎగ్గడి లోకేశ్(23) జేఎన్టీయూ హాస్టల్లోనే ఉంటూ పీజీ చదువుతున్నాడు. వారం రోజుల నుంచి ఫోన్ స్విచాఫ్ వస్తోంది. వాట్సప్‌లో తన సోదరుడు పవన్‌కు మెసేజ్పెట్టాడు. ఆన్లైన్ బెట్టింగ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నానని, అప్పులు ఎక్కువయ్యాయని, చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని లోకేశ్ఆచూకీ కోసం గాలిస్తున్నారు.