స్టూడెంట్స్‌‌ చదువుకు దూరం కావద్దనే.. మన ఊరు మన గురుకులం

స్టూడెంట్స్‌‌ చదువుకు దూరం కావద్దనే.. మన ఊరు మన గురుకులం

కరీంనగర్, వెలుగు : గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశ్యంతోనే మన ఊరికే మన గురుకులం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ దేవేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం ఎల్‌‌ఎండీ కాలనీలోని వేంకటేశ్వర స్వామి కల్యాణమండపంలో మన ఊరు మన గురుకులం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌‌ మాట్లాడుతూ డిజిటల్‌‌ క్లాసులు వింటున్న స్టూడెంట్లకు ఏవైనా డౌట్స్‌‌ ఉంటే క్లియర్ చేయడానికి టీచర్లే వారి గ్రామాల్లోకి వెళ్తారని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు టీచర్లు స్టూడెంట్ల డౌట్లు క్లియర్‌‌‌‌ చేస్తారన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలు, క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించి గెలిచిన వారికి ప్రైజ్‌‌లు ఇస్తారన్నారు.