కూకట్పల్లి, వెలుగు: కోర్సు పూర్తయినా కూకట్‌పల్లిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్మేనేజ్మెంట్అండ్ మెడికల్‌సైన్స్(ఎయిమ్స్) కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని స్టూడెంట్లు వాపోయారు. సోమవారం మధ్యాహ్నం కూకట్పల్లి పోలీసుస్టేషన్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. తామంతా అమృత ఇనిస్టిట్యూట్‌లో సైన్స్ ఒకేషనల్, పారా మెడికల్కోర్సులు పూర్తి చేసినప్పటికీ యాజమన్యం సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని చెప్పారు. కూకట్పల్లి సప్తగిరి కాంప్లెక్స్రెండో ఫ్లోర్లో అమృత ఇనిస్టిట్యూట్ కొనసాగుతుందన్నారు. వీరికి పంజాగుట్ట, మెహిదీపట్నంలోనూ బ్రాంచులు ఉన్నాయని, కూకట్పల్లి బ్రాంచ్‌లో దాదాపు 300 మంది చదువుకుంటున్నారని చెప్పారు.
ఒక్కో విద్యార్థి నుంచి రూ. 50 వేలు ఫీజులు వసూలు చేశారన్నారు. అంతకు ముందు యాజమాన్యాన్ని లోపల ఉంచి బయట షట్టర్లకు స్టూడెంట్లు తాళాలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్టూడెంట్లను స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసుస్టేషన్ఎదుట ఆందోళనకు దిగారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసి తమకు సర్టిఫికెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్‌లోనూ అమృత స్టూడెంట్లు ఆందోళనకు దిగారు.