ఫుడ్ సరిగ్గా లేనప్పుడు హాస్టల్ ఎందుకు.. నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

ఫుడ్ సరిగ్గా లేనప్పుడు హాస్టల్ ఎందుకు.. నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ బషీర్ బాగ్ లోని నిజాం కాలేజీ హాస్టల్ ముందు విద్యార్థుల ఆందోళన దిగారు. ఫుడ్ సరిగ్గా లేదని హాస్టల్ గేటు ముందు విద్యార్థులు బైఠాయించారు. రెండు నెలలుగా హస్టల్ ఫుడ్ ఇలానే పెడుతున్నారని... పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకోలేదంటూ విద్యార్థులు వాపోయారు. ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని.. ఈ అహారం తిని మేం ఏం కావాలని.. తిండి సరిగ్గా లేనప్పుడు ఇలాంటి హాస్టల్ మాకేందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే తమకు పెడుతున్న ఫుడ్ ని చేంజ్ చేసి.. మంచి అహారం పెట్టాలని డిమాండ్ చేశారు. అన్నం ఉడకకుండా రాళ్లలా ఉందని.. కూరలు నీళ్ల చారులా ఉంటున్నాయని.. దీన్ని మేం ఎలా తినాలని యాజమాన్యాన్ని నిలదీశారు. దీనిపై దర్యాప్తు జరిపి హాస్టల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ ఫుడ్ ని తిసుకొచ్చి రోడ్డుపై పెట్టారు. తమకు న్యాయం జరిగే వరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని.. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

విద్యార్థులు రోడ్డుపై బైటాయించడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.

ALSO READ :- దిక్కు తోచని స్థితిలో మార్క్‌రమ్: కెప్టెన్సీ పోయింది..తుది జట్టులోనూ చోటు కష్టమే