మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నిజాం కాలేజీ విద్యార్థులు

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసిన నిజాం కాలేజీ విద్యార్థులు

మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిజాం కాలేజీ విద్యార్థినులు కలిశారు.  హాస్టల్‌ బిల్డింగ్‌ కేటాయించాలని డిగ్రీ విద్యార్థులు కోరారు. 50--50 శాతం  ప్రకారం డిగ్రీ, పీజీ విద్యార్థులకు  కేటాయిస్తామన్నారు. ఆ తర్వాత ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ కి తాము ఒప్పుకోమని నిరసన కొనసాగిస్తామని చెప్పారు. 

డిగ్రీ విద్యార్థులకు హాస్టల్‌ బిల్డింగ్‌ కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొత్త హాస్టల్ బిల్డింగ్ ను పీజీ విద్యార్థులకు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ  అధికారులు పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు హాస్టల్ కేటాయించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.