భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం: విద్యార్థుల ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు జడ్పీ స్కూల్​ సమీపంలో నేష్నల్​ హైవే టర్నింగ్​పాయింట్​వద్ద సోమవారం బొగ్గులోడ్​ ఉన్న టిప్పర్​లారీ బోల్తా పడింది. ఈ సమయంలో స్టూడెంట్స్​లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

కాగా, స్కూల్​సమీపంలోని ఈ టర్నింగ్​వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ లారీ అదుపుతప్పి స్కూల్​గోడలో నుంచి క్లాస్​రూమ్​లోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ విద్యార్థులు నిరసన తెలిపారు.  

-చండ్రుగొండ, వెలుగు