- శ్రీచైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థుల ఆరోపణ
ఖమ్మం టౌన్, వెలుగు: ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు హాస్టల్ ఫీజు చెల్లిస్తున్నా క్వాలిటీ భోజనం, టిఫిన్ పెట్టడం లేదు.. ప్రశ్నిస్తే పెట్టింది తినమంటున్నరు.. లేకుంటే టీసీ ఇస్తమని బెదిరిస్తున్నారని ఖమ్మం సిటీలోని శ్రీ చైతన్య ప్రైవేట్ జూనియర్ కాలేజీ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఆరోపించారు.
సోమవారం ఉదయం 2 గంటలపాటు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. వారికి పీడీఎస్యూ, ప్రజాపంథా నాయకులు గోకినపల్లి మస్తాన్, ఒంగురి వెంకటేశ్ మద్దతు తెలిపారు. యాజమాన్యం చర్చలు జరపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మళ్లీ రాత్రి అన్నంలో పురుగులు వచ్చాయంటూ.. స్టూడెంట్స్ ప్లేట్లు పట్టుకొని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ తీశారు.
