ఇంటర్ బోర్డ్ ముందు విద్యార్థుల ఆందోళన

ఇంటర్ బోర్డ్ ముందు విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్ : నాంపల్లిలోని ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత నెలకొంది. బోర్డు ఎదుట విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బోర్డు అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. కనీస మార్కులతోనైనా స్టూడెంట్స్ ను పాస్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం పూర్తైన ఆర్నెళ్ల తర్వాత పరీక్షలు పెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని తల్లిదండ్రులు మండిపడ్డారు. స్పాట్ వాల్యుయేషన్ సరిగా జరగలేదని, కార్పొరేట్ కాలేజీల కోసమే పరీక్షలు నిర్వహించారని ఆరోపించారు. విద్యార్థి సంఘాల నేతలు ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.