టీచింగ్​ స్టాఫ్ లేరని విద్యార్థుల ధర్నా

టీచింగ్​ స్టాఫ్ లేరని విద్యార్థుల ధర్నా

ప్రభుత్వ విద్యాలయాల బాగు కోసం అది చేస్తున్నాం.. ఇది చేస్తున్నాం అని బీఆర్​ఎస్​ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. కానీ గ్రౌండ్​లెవల్లో రియాలిటీ వేరేగా ఉంటోంది. కాలేజీల్లో చదువు చెప్పే సార్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బోధన సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై వచ్చి ధర్నా చేసిన ఘటన కుత్బుల్లాపూర్​లో జరిగింది. 

బహదూర్ పల్లిలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజ్​ స్టూడెంట్స్​క్లాసులు చెప్పడానికి సరిపడా లెక్చరర్లు లేరని కాలేజీ గేటు ముందు జులై 24న ధర్నా నిర్వహించారు. దీనికి తోడు కళశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ధర్నా చేస్తున్న వారికి ఏబీవీపీ సంఘీభావం తెలిపింది. 

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. లెక్చరర్లు లేకపోవడంతో ఒకే సబ్జెక్టులో గతేడాది 100 మంది స్టూడెంట్స్​ ఫెయిల్​ అయ్యారని వాపోయారు. ఈ ఏడాది కూడా కొన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు లేరని బుక్స్​ ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పారు. ప్రిన్సిపల్​ని ఇదే విషయంపై ప్రశ్నించగా.. టీసీ తీసుకొని వెళ్లిపోండని అంటున్నారని విద్యార్థులు ఆరోపించారు. 

ALSO READ:డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు.. తీవ్ర ఉద్రిక్తత

ప్రైవేటుకు వెళ్లి చదువుకుందామన్నా ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదని వారు అన్నారు. ధర్నా క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్​ అయింది. విషయం తెలుసుకున్న దుండిగల్​ పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. ఇదే విషయంపై ప్రిన్సిపల్​వివరణ కోరగా.. లెక్చరర్లను రిక్రూట్​ చేసుకుంటున్నామని, ఆగస్టు నుంచి అందుబాటులోకి వస్తారని అన్నారు.