సార్..  మా సంగతేంది? స్టూడెంట్స్ ఆందోళన

సార్..  మా సంగతేంది? స్టూడెంట్స్ ఆందోళన

లాక్డౌన్తో వాయిదా పడ్డ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్
ఆందోళనలో 75 వేల మంది స్టూడెంట్స్

హైదరాబాద్, వెలుగు: రెగ్యులర్ స్టూడెంట్స్ తోపాటు డిస్టెన్స్లో చదివేవారిపైనా కరోనా ఎఫెక్ట్ పడింది. ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలాఖరులో జరగాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు లాక్డౌన్ వల్ల వాయిదా పడ్డాయి. అవి మళ్లీ ఎప్పుడు పెడ్తారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఏటా 2 సార్లు ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్లో జరిగే పరీక్షల కోసం మార్చిలో స్టూడెంట్స్ ఫీజులు కట్టారు. టెన్త్కు 42 వేల మంది, ఇంటర్కు 30 వేల మంది మొత్తం 72వేల మంది అప్లై చేసుకున్నారు. లాక్డౌన్ వల్ల ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేశారు. హైకోర్టు జూన్లో టెన్త్ రెగ్యులర్ పరీక్షలకు అనుమతి ఇవ్వడంతో, ఓపెన్ సొసైటీ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలనూ నిర్వహించాలని అధికారులు భావించారు. ప్రభుత్వం వాటిని రద్దు చేయడంతో, ఓపెన్ పరీక్షల నిర్వహణ వాయిదా పడింది. ఇవి రెగ్యులర్ పరీక్షలు కావని, ఎప్పుడైనా నిర్వహించుకోవచ్చని అధికారులు చెప్తున్నారు. నాలుగున్నర ఏండ్ల వరకు రాసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.

For More News..

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

కరోనా ఎఫెక్ట్: స్కూల్ సిలబస్ లో 30% తగ్గింపు