సెంట్రల్ బ్యాంకులో సబ్-స్టాఫ్ పోస్టులు

సెంట్రల్ బ్యాంకులో సబ్-స్టాఫ్ పోస్టులు

ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌‌‌‌మెంట్ డిపార్ట్‌‌‌‌మెంట్  దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో 484 సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

అర్హత : ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 31 మార్చి 2023 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు 
మూడేళ్లు, దివ్యాంగులకు అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్​ : ఆన్‌‌‌‌లైన్ పరీక్ష(70 మార్కులు), లోకల్ లాంగ్వేజ్ టెస్ట్(30 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌‌‌‌లైన్ పరీక్ష ఇంగ్లీష్​ మీడియంలో ఆబ్జెక్టివ్‌‌‌‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌‌‌‌ నాలెడ్జ్‌‌‌‌, జనరల్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌, ఎలిమెంటరీ అర్థమెటిక్‌‌‌‌, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తులు :  అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జనవరి 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌‌‌‌ఎం అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ.850 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్​లైన్​ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.centralbankofindia.co.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.