
ఈ శుక్రవారం మే9న రిలీజైన రెండు సినిమాలకు (సింగిల్, శుభం) మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండు వేరు వేరు కాన్సెప్ట్స్ వచ్చిన ఈ మూవీస్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, శ్రీవిష్ణు నటించిన సింగిల్ మూవీ ఆద్యంతం కామెడీ ఎంటర్టైన్ తో సాగగా.. సమంత నిర్మించిన శుభం హారర్ కామెడీ జానర్లో వచ్చింది. ఇపుడీ రెండు మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఓ లుక్కేద్దాం.
శుభం ఓటీటీ:
సమంత నిర్మించిన శుభం మూవీ ఓటీటీ హక్కులను జీ5 మంచి ధరకు సొంతం చేసుకుంది. శాటిలైట్ హక్కులు కూడా జీతెలుగు ఛానలే సొంతం చేసుకోవడం విశేషం. ఈ మేరకు శుభం మూవీ ఒకేసారి ఓటీటీ అండ్ టీవీల్లో టెలికాస్ట్ కానుందని సమాచారం.
Also Read : నెటిజన్ల ఆగ్రహంతో నిర్మాత క్షమాపణలు
అయితే, రీసెంట్ టైంలో జీ5 సొంతం చేసుకున్న మూవీస్ అన్నీ ఒకేసారి ఓటీటీ అండ్ టీవీల్లో వస్తున్నాయి. అందులో భాగంగా వచ్చినవే సంక్రాంతికి వస్తున్నాం, రాబిన్ హుడ్. వీటి తరహాలోనే శుభం కూడా రానుంది. అన్నీ కుదిరితే, వచ్చే నెలలోనే శుభం స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది.
ఆడవాళ్లలో ఉండే సీరియల్ పిచ్చిపై సినిమా సాగింది. దీనికి హారర్ కామెడీని జోడించి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సక్సెస్ అయ్యాడు. దానికితోడు ఈ కథలో ఆడవాళ్ల పరిస్థితులపై చర్చించిన విధానం ఆలోచింపజేసింది. ముస్లిం యువతి షాలిని కొండపూడి పాత్ర ఆడాళ్ల అణచివేతకు అద్దం పట్టే పాత్రలో నటించింది. బయటకు వెళ్లాలి.. బ్యూటీపార్లర్ పెట్టాలనే కోరిక ఉన్నా.. తనలోనే అణుచుకునే పాత్ర ఆలోచింపజేస్తుంది.
మరో మహిళ కొత్తగా పెళ్లై ఓ మధ్యతరగతి ఇంట్లోకి కోడలిగా వెళ్ళినప్పుడు అక్కడ తన భర్తతో, అత్తమామలతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనేది ఉన్నతంగా ఉంది. మూడో మహిళ గృహిణి అయ్యాక పురుషాధిక్యత వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులను ఎదుర్కొంది? అనే అంశం లోతుగా చర్చించిన విధానం బాగుంది.
సింగిల్ ఓటీటీ:
శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో దక్కించుకుంది. శ్రీ విష్ణు మూవీస్ కి ఓటీటీలో భారీ ప్రేక్షకాదరణ వస్తోంది. ఈ క్రమంలోనే సింగిల్ సినిమా ఓటీటీ హక్కులకు భారీ ధర పలికినట్లు సమాచారం.
ఇప్పటివరకూ శ్రీవిష్ణు నటించిన సినిమాలకు వచ్చిన అత్యధిక మొత్తం సింగిల్ మూవీకే రావడం విశేషం. అయితే, ఏ టీవీ ఛానెల్ శాటిలైట్ హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది.
ఇందులో శ్రీ విష్ణు ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ప్రేమికుడిగా నటించాడు. కార్తీక్ రాజు మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. వెన్నెల కిషోర్- శ్రీవిష్ణు మధ్య వచ్చే ఫన్నీ ఎపిసోడ్స్ తో మంచి బూస్ట్ ఇచ్చాడు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆడియన్స్ కు ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు.
స్టార్ హీరోలను శ్రీవిష్ణు ఇమిటేట్ చేసే సీన్స్ అయితే, థియేటర్స్ లో మోత మోగిపోయేలా చేసింది. కామెడీతో పాటు ఎమోషన్, రొమాంటిక్ సీన్లతో వచ్చిన సింగిల్..ఈ వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.