
ముషీరాబాద్, వెలుగు: ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని టీజీఆర్ఈడీసీవో జిల్లా మేనేజర్ పండరీ, డిప్యూటీ తహసీల్దార్చందన తెలిపారు. శుక్రవారం ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై ముషీరాబాద్ తహసీల్దార్ఆఫీస్లో అవగాహన సదస్సు నిర్వహించారు. కిలో వాట్ సామర్థ్యం ఉన్న ప్లేట్స్ఏర్పాటు చేసుకోవాలనుకుంటే రూ.30 వేలు, 2 కిలోవాట్స్ కు రూ.60 వేలు, 3 కిలోవాట్స్సామర్థ్యం ఉన్న ప్లేట్స్కు రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ స్కీంకు పలు బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయని అన్నారు. www.pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.